Header Banner

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

  Fri Apr 25, 2025 07:46        Politics

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం కొత్త వితంతు పెన్షన్లకు సీఎం ఆమోదం తెలిపారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ నెలకు రూ.4 వేలు చేసిన సంగతి తెలిసిందే. దివ్యాంగులకు సైతం నెల రూ.6 వేలు ఇస్తోంది. ఒకటో తేదీ ఉదయాన్నే ప్రభుత్వ అధికారులు ఏకంగా ఇంటికొచ్చి మరీ పెన్షన్ అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు లక్ష కొత్త పెన్షన్లకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకోవడం కోసం 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు. మే నెల మొదటి తారీఖు నుండి వీరందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ధరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్‌ను జూన్ నుండి అందజేస్తారు.

 

ఇది కూడా చదవండిటెన్షన్... టెన్షన్! వైసీపీ నేతల్లో వణుకు! కీలక నిందితుడికి రిమాండ్!


కాగా, 2014- 19 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ నమోదు ప్రక్రియ నిరంతరాయంగా జరిగేది. లబ్ధిదారులు వారంలో ఏ రోజైన సరే పెన్షను దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అధికారులు వాటిని ఏ వారానికి ఆ వారం పరిశీలించి నెలాఖరుకు పెన్షన్ జాబితాను సిద్ధం చేసేవారు. ఫలితంగా అర్హులైన లబ్ధిదారులకు ఆ మరుసటి నెల నుంచే పెన్షన్ పొందే అవకాశం ఉండేది. కానీ, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానానికి చెక్ పెట్టింది. ఆరు నెలలకు ఒకసారి మాత్రమే లబ్ధిదారుల జాబితాను రూపొందించే విధానం తీసుకొచ్చింది.

 

ప్రతి ఏడాది జూన్‌, డిసెంబరు నెలల్లోనే జాబితా రూపొందిస్తామని తేల్చి చెప్పింది. అయితే, గడిచిన ఐదేళ్లలో ఒక్క సారి కూడా ఆ ప్రకారంగా జాబితాను రూపొందించిన దాఖలాలు లేవు. విద్యుత్‌, ఇన్‌కమ్‌ టాక్స్‌, ఫోర్ వీలర్, ఇళ్లు, పొలం తదితరాల పేరుతో వేలాదిమందిని పెన్షన్ పథకానికి అనర్హులను చేసి జగన్ ప్రభుత్వం తొలగించింది. అయితే, ఇలాంటి వారంతా కూటమి ప్రభుత్వంలో ఉపశమనం పొందుతున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో షాక్.. ఆ కేసులో కీలక పరిణామం! మాజీ మంత్రి అనుచరుడు అరెస్టు!

 

ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

 

ఆంజనేయులు కోరికను తిరస్కరించిన అధికారులు.. జైలు నిబంధనల ప్రకారం..

 

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..

 

ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!

 

హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఇకపై లక్ష రూపాయల జరిమానా!

 

సబ్జా గింజలతో ఫుల్ ఆరోగ్యం! ఆ మూడు రకాల సమస్యలకు ఇదే చక్కటి పరిష్కారం!

 

IPS టు IAS! యూపీఎస్సీ సివిల్స్‌లో 15వ ర్యాంక్‌తో తెలుగు కుర్రోడు!

 

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #APGoodNews #NewPensionsApproved #CBNForPeople #PensionGreenSignal #AndhraWelfare